అవుసుల భానుప్రకాశ్

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
Dr. Avusula Bhanu Prakash
అవుసుల భానుప్రకాశ్
జననండాక్టర్ అవుసుల భానుప్రకాశ్
24-12-1979
గ్రామం : బూరుగుపల్లి, మండలం : హవేలిఘన్‌పూర్
నివాస ప్రాంతంమెదక్ జిల్లా భారత దేశముIndia
ప్రసిద్ధికవి, సంపాదకులు, ప్రభుత్వ పాఠ్యపుస్తక రచయిత, అష్టావధాని
మతంహిందూ
తండ్రిఅవుసుల గోపాల్
తల్లిఅవుసుల శశిరేఖ
వెబ్‌సైటు
https://Avusulabhanuprakash.blogspot.in/
అవుసుల భానుప్రకాశ్ మెదక్ జిల్లాకు చెందిన కవి, సంపాదకులు, పాఠ్య పుస్తక రచయిత మరియు పాఠ్య పుస్తక అభివృద్ధి కమిటీ సభ్యులు, అష్టావధాని. వృత్తి రీత్యా ఉపాధ్యాయులు.

జీవిత విశేషాలు[మార్చు]

అవుసుల భానుప్రకాశ్ మెదక్ జిల్లా బూరుగుపల్లిలో పుట్టి పెరిగి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ, ఎం.ఫిల్ పట్టా పుచ్చుకొని భాషోపాధ్యాయులుగా సంగారెడ్డిలో స్థిర నివాసం ఏర్పరచుకొన్నారు. తెలుగు భాషోపాధ్యాయునిగా, ప్రభుత్వ పాఠ్యపుస్తక రచయితగా, విషయనిపుణులుగా, జిల్లాలో ప్రముఖ వ్యాఖ్యాతగా, మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ వ్యపస్థాపకులుగా, ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. తాను సాహితీ క్షేత్రంలో వికసిస్తూ అనేక మందికి, నూతన కవులకు దిశానిర్దేశం చేసే నాయకత్వ పటిమ కలవాడు. భావిభారత పౌరుల కోసం ఇన్ స్పిరేషన్ టు ది నేషన్ అనే కార్యక్రమం ద్వారా వ్యక్తిత్వవికాస నిపుణునిగా సేవలందిస్తున్నారు. లబ్ధ ప్రతిష్ఠులైన వీరు పది అష్టావధానాలు [1] పూర్తి చేశారు.

రచనల జాబితా[మార్చు]

  1. భారతీ నీకై అక్షర హారతి (కందపద్యాలు)
  2. హైందవ వీరా ! (శివాజీ గేయ గాథ)
  3. అంతర్నేత్రం (వచన కవిత్వం)
  4. ఆవాహన (వివేకానందుని ప్రేరణా గీతికా)
  5. మెతుకుసీమ - కవనసీమ (సంపాదకత్వం)
  6. జర బోలో శంకర! (వ్యంగ్య ఖండికలు)
  7. బంగారు తెలంగాణా భవ్యవీణ (శతకం)
  8. భారత్ మాతాకీ జై (సంపాదకత్వం)
  9. తెలంగాణా వీరుడా ! (శతకము)
  10. ప్రణయ మధురిమ (రుబాయీలు)
  11. మానవ భరతం (వచన కావ్యం ) [2]
  12. వాగ్దేవతా శతకము [3]
  13. సైనికార్చన - సంపాదకులు (సైనిక ప్రాశస్త్య కవితా సంకలనం)

పురస్కారాలు[మార్చు]

  • జాతీయ సాహిత్య పరిషత్తు, సిద్ధిపేట వారి ఉత్తమ యువకవి పురస్కారం
  • గాంధీ ప్రతిష్టాన్ & గాంధీ గ్లోబల్ కుటుంబం వారిచే స్వర్ణకంకణ సత్కారం , సాహితీ కళాప్రవీణ' బిరుదును పొందడం. (2018)
  • గురజాడ ఫౌండేషన్, అమెరికా వారి రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి సాహిత్య పురస్కారాలు.
  • జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం (2017)
  • జిల్లా సాహితీ పురస్కారం (2011)
  • సహస్ర కవితా వైభవం వారిచే సహస్ర పద్య కంఠీరవ బిరుదు ప్రదానం (2017)
  • ప్రపంచ తెలుగు మహాసభల్లో పద్య కవిత్వ సదస్సు నిర్వహణ సత్కారం (2017)[4]
  • రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ వారి కాళోజి జయంతి పురస్కారం (2015)
  • తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పద్య తెలంగాణ కవిత్వ పురస్కారం (2016)
  • రాష్ట్ర అవతరణ వేడుకల సాహిత్య పురస్కారం (2016)
  • వివిధ సంస్థల చేత వ్యాఖ్యాన సత్కారాలు
  • అనేక (దాదాపు వెయ్యికి పైగా ) ప్రభుత్వ / ప్రత్యేక కార్యక్రమాల వ్యాఖ్యాన సేవలు , సత్కారాలు
  • అనేక సందర్భాలలో కవిత్వ పఠన సత్కారాలు
  • పది అష్టావధానాల నిర్వహణలో అవధాన సత్కారాలు
  • తెలుగు రక్షణ వేదిక వారి సాహిత్య పురస్కారం

మూలాలు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి